Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Kuldeep Yadav Added To India Squad For Third Odi Against Bangladesh

IND vs BAN: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. కుల్దీప్ యాదవ్‌కు చోటు.. సారథి ఎవరంటే?

Published Date :December 9, 2022 , 1:26 pm
By Mahesh Jakki
IND vs BAN: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. కుల్దీప్ యాదవ్‌కు చోటు.. సారథి ఎవరంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs BAN: బంగ్లాదేశ్‌తో రేపు జరిగే మూడో వన్డేలో స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌ను చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్‌ను చివరి వన్డే కోసం భారత జట్టులో చేర్చింది.

బంగ్లాదేశ్‌తో జరిగే మూడో వన్డేకు తప్పుకున్న ముగ్గురు ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉన్నాడని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. మూడో వన్డేలో కేఎల్‌ రాహుల్‌ సారథ్యం బాధ్యత వహించనున్నాడు. గాయం నేపథ్యంలో రోహిత్ మూడో వన్డేకు దూరమయ్యాడని, నిపుణులను సంప్రదించేందుకు ముంబై వెళతాడని ద్రవిడ్ పేర్కొన్నాడు. గాయాల వల్ల రోహిత్‌తో పాటు బౌలర్లు కుల్దీప్ సేన్‌తో పాటు దీపక్‌ చాహర్‌ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. మొదటి వన్డే తర్వాత ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ తన వెన్నులో నొప్పిగా ఉందని తెలపడంతో మ్యాచ్‌కు దూరంగా ఉంచారు. బీసీసీఐ వైద్య బృందం అతడిని అంచనా వేసి 2వ వన్డే నుంచి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. తోటి ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌కు రెండో వన్డే సమయంలో గాయం కాగా… సిరీస్‌కు దూరమయ్యాడు. కుల్దీప్ సేన్‌, దీపక్ ఇద్దరూ ఇప్పుడు వారి గాయాల నిర్వహణ కోసం ఎన్‌సీఏకు రిపోర్ట్ చేస్తారు.

Burqa Dance Video: బురఖాలు ధరించి డ్యాన్సులు.. 4గురు విద్యార్థులు సస్పెండ్.. వీడియో వైరల్

రోహిత్‌ శర్మకు రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చేతి బొటనవేలికి గాయమైంది. రోహిత్ ఢాకాలోని స్థానిక ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకున్నాడు. అనంతరం స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసం ముంబైకి వెళ్లాడు. రాబోయే టెస్ట్ సిరీస్‌కు రోహిత్ ఉంటాడా లేదా అనేది త్వరలో నిర్ణయించబడుతుందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

బంగ్లాదేశ్‌తో జరిగే 3వ వన్డేకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (సీ) , శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (డబ్ల్యూకే), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Deepak Chahar
  • ind vs ban
  • india
  • India squad for 3rd odi

తాజావార్తలు

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

  • Kavitha : BRSలో కలవరానికి కారణమవుతున్న కవిత మాటలు

  • Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..

  • Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

  • Story Board: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా.. ఇండియాలో తప్పని కష్టాలు.. యుద్ధం అందర్నీ ముంచేస్తోందా..?

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions