Madhavaram Krishna Rao: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి వహించారు. వసంత్ నగర్, కూకట్‌పల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తు, అది ఎవరికి కూడా జాగిరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తుందని, ఇప్పుడు కూడా అదే జరగాలా? అని అన్నారు.
Also Read: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఆన్ ఫైర్.. 4 రోజుల్లో అన్ని కోట్లా?
మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. 6 గజాల నుండి 30 గజాల స్థలాలను వేలం వేయడం దుర్మార్గంగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హౌసింగ్ బోర్డు స్థలాలను కాపాడి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించామని గుర్తుచేశారు. ఈ స్థలాలను, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా.. ఇప్పుడు మిగిలిన స్థలాలను కూడా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని, ఎవరైనా ఈ స్థలాలను కొనుగోలు చేస్తే.. వారిని ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటాం అని అన్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇంకా హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మాధవరం కృష్ణారావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read: Chennai : దారుణం.. కూతురితో వ్యభిచారం చేయిస్తూ వీడియోలను తీసిన తల్లిదండ్రులు