సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపెనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని.. కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారని మండిపడ్డారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిధులు లేకుండా చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడి కోసం అమెరికా వెళ్ళాడు అని బదనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నా.. కేటీఆర్ షాడో సీఎంగా పని చేశాడని కొండా సురేఖ తెలిపారు.
Read Also: Jathara : ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఏంట్రా ఇలా ఉంది?
స్వచ్చ బయో సిలికాన్ తో సీఎం తమ్ముడికి లబ్ధి చేకూర్చేందుకు అని విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బీఆర్ఎస్ లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేశారని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, దళిత బంధు, ధరణి ఇలా అన్నింటిలో అవినీతి చేశారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అవన్నీ బయట పెడుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అప్పులు తీర్చేందుకు.. లోటును భర్తీ చేసేందుకు పని చేస్తుంటే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Manish sisodia: తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల.. 17 నెలల తర్వాత విముక్తి
ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చో పెడితే.. ప్రభుత్వానికి సహకరించకుండా, విమర్శలు చేయడం తగదని అన్నారు. ఆధారాలు తీసుకుని వచ్చి ఆరోపణలు చేయండని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు చేస్తున్నాం.. కేటీఆర్ సొంత డబ్బా కొట్టుకునేందుకు పెయిడ్ ఛానెల్స్ పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి సీతక్క మీద కూడా దుర్మార్గంగా, నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు.. వారి మీద కూడా చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు మేలు కోసం ప్రభుత్వం పనులు చేస్తే.. సహకరించేందుకు ప్రతిపక్షం సహుద్భవంతో ముందుకు రావాలని అన్నారు.