KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని యథాతథంగా కొనసాగించేలా తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లు దక్షిణాది ప్రజల విజయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు ఎలాంటి శిక్ష పడకూడదనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ ఒకే వాదనను వినిపిస్తోందని ఆయన గుర్తుచేశారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం ప్రాతినిధ్యం కొనసాగాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, గతంలో అందుకు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించామని కేటీఆర్ తెలిపారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. జనాభా పెరుగుదల ప్రాతిపదిక కాకుండా తీసుకువస్తున్న తొలి డీలిమిటేషన్ ఇదేనని, దీని వెనుక బీఆర్ఎస్ పోరాటంతో పాటు దక్షిణాది ఐక్య ఉద్యమం ఫలించాయని అన్నారు.
ఈ నూతన డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 180కి, లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ వివరించారు. అయితే, ఈ ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా, అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే ఈ డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని నిలదీశారు. మళ్లీ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోందా అని ప్రశ్నించిన ఆయన, అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లదా అని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ వద్ద ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే వాటిని ప్రజల ముందు స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read
- Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
- Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
- CM Chandrababu: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కూటమి ఎంపీలకు కీలక ఆదేశాలు!
- MS Dhoni: '7' నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
తాజావార్తలు
-
KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
-
Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
-
Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కూటమి ఎంపీలకు కీలక ఆదేశాలు!
-
Shashi Tharoor: 850 మంది ఎంపీలతో లోక్‌సభ నడుస్తుందా?.. చప్పట్లు కొట్టడానికే చాలామంది వస్తారు..
ట్రెండింగ్
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!