NTV Telugu Site icon

KTR Tweet : మొన్న ఎలుక.. నేడు పిల్లి.. జేఎన్టీయూహెచ్ హాస్టల్లో..

Cat At Jntuh

Cat At Jntuh

KTR Tweet : రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి బయటపడింది. హైదరాబాద్ మహానగరంలో నుంచి జేఎన్టీయూ క్యాంపస్ హాస్టల్ లో తాజాగా ఓ పిల్లి కలకలం సృష్టించింది.

CMF Buds Pro 2 Price: సూపర్ డిజైన్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 43 గంటలు నాన్‌స్టాప్‌గా..!

ఓ పిల్లి కాలేజీ క్యాంపస్ హాస్టల్ లో ఉన్న మజ్జిగ బకెట్లో తలపెట్టి తాగేసింది. ఇక మధ్యాహ్న భోజనం సమయంలో భోజనానికి వచ్చిన విద్యార్థులు ఈ ఘటనను చూసి వారి మొబైల్ లో రికార్డు చేశారు. ఆ తర్వాత ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని తాజాగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ షేర్ చేశారు. ఈ ట్వీటుకు ” ఈ సారి జేఎన్టీయూ హైదరాబాద్ బాయ్స్ హాస్టల్ లో ఉన్న ఎలుకను వెతుక్కుంటూ పిల్లి వచ్చింది ” అంటూ రాసుకొచ్చాడు.

IND vs SL: శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!

ఆ తర్వాత అదే పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రీట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన జేఎన్టీయూలో ఎలుకలు పిల్లులకు నిలయంగా మారాయి అంటూ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇక కేటీఆర్ పోస్టుకు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. “ఎలుకను పట్టుకోవడానికి పిల్లి తెచ్చినట్టు ఉన్నారు అన్న.. ఎంతైనా ప్రజాపాలన కదా” అని నెటిజన్ సెటైరిక్ గా కామెంట్ చేస్తున్నారు.