Site icon NTV Telugu

KTR : భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచింది

Ktr

Ktr

KTR : డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 14 ఏళ్ల కఠిన పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలోనే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిన ఘనత గురించి ఆయన గర్వంగా చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఇంజన్‌గా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ నాయకత్వానికి చెందిందని వివరించారు.

“జననీ జన్మభూమి చుట్టూ మరింత బాధ్యత తీసుకోవాలి” అంటూ తన ప్రసంగం ప్రారంభించిన కేటీఆర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని, సంకల్పంతో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొనవచ్చని సూచించారు. మూడేళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని స్పష్టం చేశారు. పుట్టిన ప్రదేశం పేరు వినగానే ప్రతీ ఒక్కరి హృదయం గర్వంతో నిండుతుందని, తెలంగాణ అనేవాళ్ళకి గతంలో కష్టాలు, ఆకలి, ఎన్‌కౌంటర్లు గుర్తొచ్చేవని, ఈ పదేళ్లలో అవన్నీ పూర్తిగా మారాయని తెలిపారు.

Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్‌తో దాడి.. చివరకి..?

2014లో తెలంగాణ జీఎస్‌డీపీ నాలుగున్నర లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు 15 లక్షల కోట్లకు చేరువయ్యింది అని పేర్కొన్నారు. అప్పులు చేసినా ఆర్థిక చక్రాన్ని గరిష్టంగా ఉపయోగించి పేదలకు సహాయం అందించినట్లు వివరించారు. కాకతీయుల కాలువలు, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వంటి మెగాప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం పునరుజ్జీవనమైందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, నాలుగేళ్లలోనే ఈ పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్ నేతృత్వానికి చెందిందని హైలైట్ చేశారు.

హైదరాబాద్ నగరంలో జరిగిన అద్భుత అభివృద్ధిని సూచిస్తూ, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆశ్చర్యపోయారని చెప్పారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశామని, 8,000 మంది విద్యార్థులను విదేశాల్లో 20 లక్షల రూపాయల స్కాలర్షిప్‌తో చదువుపెట్టారని తెలిపారు. అమెరికాలోని భారత విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్లు, వారి అండగా నిలబడతామని, కేసీఆర్ దూతగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ భయపడాల్సిన అంశం కాదని, మార్పు అనివార్యమని, అందరం ఈ మార్పుకు అలవాటు పడాల్సిందని సూచించారు.

Women’s World Cup 2025: మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్, వేదికలు ఖరారు.. నవంబర్ 2న ఫైనల్..!

Exit mobile version