NTV Telugu Site icon

KTR: ఇంకా వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. ఇదొక లొట్టపీసు కేసు

Ktr 2

Ktr 2

ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం.. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్‌లో తనను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో అవినీతి ఎక్కడుంది అని అధికారులను అడిగాను.. దీంతో అధికారులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్లు.. రేవంత్ రెడ్డికి అందరూ దొంగలుగానే కనిపిస్తారని విమర్శించారు. తాను ఒక్క పైసా అవినీతి చేయలేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి వస్తా.. ఓపెన్‌గా కెమెరా పెట్టు.. ఈ కేసుపై చర్చిద్దామని సవాల్ చేశారు. కావాలంటే లై డిటెక్టర్ పెట్టు అని కేటీఆర్ అన్నారు.

Read Also: Shamshabad: దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు

కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు మద్దతుగా వచ్చిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. గత పది సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వం అవినీతి లేకుండా పని చేశామని పేర్కొన్నారు. తనను ఏసీబీ వాళ్ళు 80కి పైగా ప్రశ్నలు అడిగారు.. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్ళీ అడిగారన్నారు. ఏసీబీ వాళ్లకు కూడా ఈ కేసులో ఏమి లేదని తెలుసని.. ఇంకా తనపై వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. ఇదొక లొట్టపీసు కేసు మాత్రమేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు కాబట్టి అందర్నీ పంపాలని చూస్తున్నాడు.. నిన్ను ఎవరూ సీఎంగా గుర్తు పట్టట్లేదని వ్యాఖ్యానించారు. అందుకే అందరూ పేరు మరిచి పోతున్నారని ఆరోపించారు. తనను అడగడానికి ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు లేవన్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రశ్నలు పంపితే మళ్లీ పిలుస్తారు ఏమో..
మళ్లీ విచారణకు వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ తెలిపారు.

Read Also: Tragedy love story: ప్రియురాలి కుటుంబం వేధింపులు.. యువకుడి ఆత్మహత్య..

Show comments