KTR : ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే బనకచర్ల ప్రాజెక్ట్. కానీ రేవంత్ మీడియా ముందు అబద్ధం చెప్పాడు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు.
Read Also : Telangana : తెలంగాణలో తగ్గిన ఎంపీటీసీల సంఖ్య
ఈ రోజుతో అసలు కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో తేలిపోయింది. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా.. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు. ఇక రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనాల్సిన బాధ ఉండదేమో అంటూ రాసుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. వాటా కంటే ఎక్కువ నీరు ఇస్తే మరో పోరాటం చేస్తామన్నారు కేటీఆర్.
Read Also : Seethakka : బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్
