KTR: నాడు పరిశ్రమలకు రాయతీపై విలువైన భూములు కేటాయించారు.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఇపుడు భారీగా పెరిగాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా కుత్బుల్లాపూర్‌లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జీడిమెట్ల ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో 75 వేల కోట్ల వరకు విలువ చేసే భూములు ఉన్నాయి.. రెండేళ్లలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ఇండ్లు కట్టవచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టవచ్చు… కానీ, ఇవేవీ చేయరట.. శ్మశాన వాటికలకు కూడా స్థలం లేదు.. కాలుష్యాన్ని నివారించాలని అనడంలో ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మార్కెట్ ధరకు కూడా కాదు… రిజిస్ట్రేషన్ ధరలో 30 శాతం ఇచ్చి ఏమైనా చేసుకోవచ్చు అని ప్రభుత్వం అంటోంది.. ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదన్నారు. ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించిందని.. ప్రజల ఆస్తిని సరైన పద్ధతిలో వినియోగించండన్నారు. ప్రజల కోసం వినియోగించండి, గ్రీన్ ఇండస్ట్రీస్ పెట్టండని పిలుపునిచ్చారు.
READ MORE: Virat Kohli: ఇక కోహ్లీని ఎవరూ ఆపలేరు.. 2027 ప్రపంచకప్ జట్టు నుంచి గంభీర్ ఎలా తప్పించగలడు?
ప్రభుత్వం ఇచ్చే ఆషాఢ సేల్ లాంటి ఆఫర్ ను చూసి పారిశ్రామిక వేత్తలు మోసపోవద్దని.. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వెనక్కు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. “చట్టం తీసుకొచ్చి చర్యలు తీసుకుంటాం.. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగం కావద్దని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నాం.. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ, హిల్ట్ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.. కోకాపేటలో వందల కోట్లు… జీడిమెట్ల ప్రాంతంలో కోటి రూపాయలు అంటే ఎలా? గజం 4000 రూపాయల చొప్పున కార్మికులకు ఇవ్వండి.. రేవంత్ రెడ్డి… అవినీతి అనకొండ.. ఢిల్లీకి మూటలు పంపేందుకు, దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు.. బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదు.. హైదరాబాద్ లో అందరికీ అవగాహన కల్పిస్తాం… సమావేశాలు పెడతాం, న్యాయస్థానాల్లో పోరాడతాం .. రౌండ్ టేబుల్ సమావేశాలు, అఖిల పక్ష సమావేశాలు పెడతాం.. నిజ నిర్ధారణతో పాటు ధర నిర్ధారణ చేస్తాం.. గ్రిడ్ పాలసీలో ఐటీ పరిశ్రమలు పెట్టమని చెప్పాం… దాన్ని ఎలా తప్పు పడతారు.. హిల్ట్ పాలసీలో మల్టీ పర్పస్ అంటున్నారు.. ఓఆర్ఆర్ కేవలం లీజుకు ఇస్తే రేవంత్ రెడ్డి నాడు ఏమన్నారు?.. ఇవాళ ఐదు లక్షల కోట్ల విలువైన భూములను శాశ్వతంగా రాసిస్తున్నారు.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారు?.. భూములను ప్రజలు, కార్మికుల కోసం ఉపయోగించుకోండి.. హైదరాబాద్ లో లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు… వారికి ఇండ్లు కట్టించి ఇవ్వండి.. పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తామంటే ఎలా?.. హైడ్రా పేరిట పేదల గుడిసెలు తొలగిస్తున్నారు… పెద్దవాళ్ళకు మాత్రం ధారాదత్తం చేస్తున్నారు.. హిల్ట్ పాలసీ బయటకు ఎలా వచ్చిందని ప్రభుత్వం గింగిరాలు తిరుగుతోంది.. దోపిడీ జరుగుతుంటే ఎవరో తెలంగాణ బిడ్డ సమాచారం ఇచ్చారు.. హిల్ట్ భూముల విషయంలో ఇది ఆరంభం మాత్రమే… పోరాటం ఇంకా కొనసాగిస్తాంకార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం..” అని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.