KTR: తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడం తప్పా ఇంకేమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒకవేళ జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే.. ‘మేము మోసం చేసినా మాకు ఓటు వేశారు’ అని వాళ్ళే అంటారని అన్నారు. ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Realme P3 Lite 5G vs POCO M7 Pro 5G: ధర, కెమెరా, డిస్ప్లే, పనితీరు.. బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ ఏది?
మంత్రుల అంతర్గత కలహాల గురించి ప్రస్తావిస్తూ.. పార్టీలోని మంత్రులు గత వారం కొట్టుకున్నారని.. ఉపఎన్నికల్లో మీరు గుద్దే గుద్దుడికి కాంగ్రెస్ వాళ్లు తుక్కు తుక్కు కావాలి అంటూ కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి.. వాళ్ళు జాదుగాళ్ళు అంటూ చురకలు అంటించారు. ఇక గతంలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల అంశాన్ని లేవనెత్తుతూ.. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అది, ఇది చేస్తామని చెప్పి ఒక్క పైసా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు, 800 రోజుల్లో ఉన్న బాకీ కార్డుని వారిని అడగాలని ప్రజలకు సూచించారు. చివరగా, కాంగ్రెస్ వాళ్ళు ప్రమాణం చేయమంటారు. కళ్ళు మూసుకొని అని బీఆర్ఎస్కి ఓటు వేయండి అంటూ ఓటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు.