KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్‌ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం లోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ రెండేళ్ల లో ఏమన్నా జరిగింది అంటే మహిళలకు ఇచ్చే ఫ్రీ బస్సు మాత్రమే అన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అని.. మగవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు గుంజు తున్నారని తెలిపారు. నిన్న సీఎం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఆయన ఓటర్లను బెదిరిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి చక్రవర్తి లాగా ఫీల్ అవుతున్నారు.. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. ఇలాంటి సీఎంని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ అభిమాని. మాగంటి గోపీనాథ్ ఆకాల మరణం చెందితే వచ్చిన ఎన్నిక ఇదని గుర్తు చేశారు.. తమ పార్టీ గోపినాథ్ భార్యకు టికెట్ ఇచ్చిందని.. ప్రచారంలో ఆమె గోపీనాథ్ గుర్తు వచ్చి ఏడిస్తే మంత్రులు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
KTR: తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉంది..

Ktr