KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో పాటలు రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ అనేక పాత్రలు పోషించారని, తెలంగాణ సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేశారని పేర్కొన్నారు. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో ముందుకు సాగి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కేసీఆర్ జీవిత గాథపై సినిమా తీయాలని ఒక దర్శకుడు తనను కలిసిన సందర్భాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ ఆవిర్భావం అనేది అన్ని ప్రతికూల పరిస్థితులను ఛేదించి సాధించిన చారిత్రక విజయమని ఆ దర్శకుడు అభిప్రాయపడ్డారని తెలిపారు. కేసీఆర్ అనే మూడు అక్షరాల ముందు “ముఖ్యమంత్రి” అనే పదవి చాలా చిన్నదిగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెప్పారు.
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. “పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది. నిష్ఫల తెలంగాణగా మారిపోయింది” అని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం పదవిని మాత్రమే కాదు.. అవసరమైతే ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడిన ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి వేలాది కుటుంబాల కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొందరు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే విజయం సాధించిందని, 2023 ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం రాష్ట్రాన్ని వెనక్కి నెట్టే విధంగా పాలన సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. “వడ్డించిన విస్తరి లాంటి తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిగా మార్చుతున్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ అన్నారు. అయితే ఈ పరిస్థితులు శాశ్వతం కాదని, 2028 డిసెంబర్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!