NTV Telugu Site icon

KTR: ఏడాది పాటు రజతోత్సవ వేడుకలు.. బీఆర్ఎస్ నూతన అధ్యక్షుడి ఎన్నికపై కేటీఆర్ క్లారిటీ..

Ktr

Ktr

కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. “ఈ రోజు చాలా విస్తృతంగా, సుదీర్ఘంగా సమావేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా పార్టీ ముఖ్యులు 30 మంది మాట్లాడారు. తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణ కవచం.. గతంలో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ ఎలా అవమానించిందో కేసీఆర్‌ గుర్తుచేశారు.. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్‌ వెనక్కి తగ్గదు.. ఎంతో మంది త్యాగాలు చేసి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ గుర్తు చేశారు. జలదృశ్యంలో మొదలైన పార్టీ 25 ఏట అడుగు పెడుతుంది. సంవత్సరం పాటు రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. గతంలో జరిగిన పోరాటాలు అన్నింటినీ గుర్తు చేస్తూ మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పృశిస్తూ మాకు దిశా నిర్దేశం చేశారు. మాకు అధికారమే పరమావధిగా పనిచేసే ఆలోచన లేదు. రజతోత్సవ నిర్వహణ కోసం వారం రోజుల్లో కొన్ని కమిటీలు వేయబోతున్నారు. పార్టీ సంస్థాగతంగా నిర్మాణము చేయాలి అనుకున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో ప్రతినిధుల సభ ఉంటుంది.” అని మాజీ మంత్రి తెలిపారు.

READ MORE: Bikes : దాదాపు ఒకే ధరలో లభించే హోండా హార్నెట్ 2.0, యమహా ఎంటీ 15 వీ2 లలో ఏది బెటర్

“ఏప్రిల్ 27 న బహిరంగ సభ పెడతాం. గ్రామ, మండల, జిల్లా కమిటీ లు వేసుకొని.. అక్టోబర్ నాటికి పార్టీ అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. ఇవన్నీ ఈ సంవత్సరంలోనే జరుగుతాయి. రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలంటే ఒక్క బీఆర్ఎస్‌తో మాత్రమే సాధ్యం.. మాకు అధికారం ముఖ్యం కాదు.. తెలంగాణ అస్థిత్వం, పరిరక్షణే మాకు ముఖ్యం.. బీఆర్ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం.. ఉద్యమ సహచరులను ఒక్కటిగా చేసి ముందుకెళ్లడమే మా లక్ష్యం. కులగణన సర్వే సరిగ్గా జరగలేదు అని చెప్పాం. మా వివరాలు అన్నీ అఫిడవిట్ లో ఉన్నాం. బీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యం అని ముఖ్యమంత్రి అంటున్నారు. కామారెడ్డి లో ఎందుకు బీసీ డిక్లరేషన్ చేశారు. ఎవరిని ఎవరు బహిష్కరణ చేస్తారో చూద్దాం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

READ MORE: Minister Nara Lokesh: మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి.. ప్రపంచం మొత్తం ఇప్పుడు మన వైపు చూస్తోంది..