KTR: త్వరలో ఉపఎన్నికలు వస్తాయి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పలువురు కార్యకర్తలు
- త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి- కేటీఆర్
- రేవంత్ రెడ్డి ఒక్క మంచి పని చేయలేదు- కేటీఆర్
- రేవంత్ రెడ్డి చేసిన చెడు చెబితే.. చెవిలో రక్తాలు కారుతాయి- కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. కార్తీక్ రెడ్డి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వస్తారని తెలిపారు. కేసీఆర్ దళం గులాబీ వనంలోకి వస్తున్న అందరికీ స్వాగతం అని పేర్కొన్నారు. నిన్న కాంగ్రెస్ మీటింగ్ లో మూడు ఆణిముత్యాల మాటలు చెప్పారు.. మంచి మైక్‌లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి అన్నారు.. మంచి చెప్పడానికి నువ్వు చేసిన ఒక్క మంచి పని లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన చెడు చెబితే.. చెవిలో రక్తాలు కారుతాయని అన్నారు.
Read Also: Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. కడప రిమ్స్ కి తరలింపు !
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
కొత్తగా వచ్చిన ఇంచార్జి మీనాక్షి తన బ్యాగ్ మోయొద్దు అని చెప్పింది.. నీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డినే బ్యాగ్‌లు మోసి పైకి వచ్చాడని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డిని బండ బూతులు తిడుతున్నారు.. రైతు బంధు ఎవరికీ పడడం లేదు అని తిడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు టింగ్ టింగ్ మని పడేవి అని చెబుతున్నారు.. అందుకే రేవంత్ రెడ్డికి టింగ్ టింగ్ అనే పదం పడదని విమర్శించారు. అందుకే టకీ టకీ మని రైతు భరోసా పడుతుంది అంటున్నాడు.. ఎక్కడ చూసినా రైతు భరోసా పడట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఫాం హౌస్‌లు ఎవరికీ లేవు లోకం మీద.. నాకు ఒక్కడికే ఉన్నట్లు చెబుతున్నారు.. జెన్వాడలో ఉన్న తన కోసమే హైడ్రా ఏర్పాటు చేశారని కేటీఆర్ ఆరోపించారు.
Read Also: Re Shoot: 10 కోట్లు బూడిదలో పోయించిన పాన్ ఇండియా స్టార్
మరోవైపు.. ఎస్ఎల్‌బీసీ ప్రమాదానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ మండిపడ్డారు. వేగంగా కమీషన్ల కోసం పనులు స్టార్ట్ చేశారు.. ఎస్ఎల్‌బీసీ వద్ద ఒక మంత్రి చేపలు తిందాం అంటాడు.. ఇంకో మంత్రి నీళ్లు వాటర్ కలవడం వల్ల జరిగింది అంటున్నాడు.. ఇలాంటి మంత్రులు ఉన్నారని దుయ్యబట్టారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదానికి కారణం కేసీఆర్ అని అంటున్నారు.. అధికారం కోల్పోయి ఇన్ని నెలలు అయినా కేసీఆర్ అనే అంటున్నారని పేర్కొన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికలు అయినా.. పార్లమెంట్ ఎన్నికలు అయినా గులాబీ జెండానే ఎగురుతుందని తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు.. ఇంకోసారి అసలు మోసపోవద్దని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!