Site icon NTV Telugu

KTR: హెచ్‌సీయు భూముల విషయంలో అతి పెద్ద కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Ktr

Ktr

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పిస్తూ.. 1022 గురుకుల పాఠశాలలు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా విధ్వంసం చేస్తున్నారు.. ప్రజల దృష్టి మరల్చి కుంభకోణానికి పాల్పడుతున్నారు..hcu భూముల విషయంలో అతి పెద్ద కుట్ర జరిగింది.. దీని వెనకాల 10 వేల ఎకరాల స్కాంకు తెరలేపారు.. రేవంత్ ప్రభుత్వం ఆర్ధిక నేరానికి పాల్పడుతోంది.. ఇది TGIIC కి చెందిన భూమి కాదు.. ఈ భూమికి అటవీ భూమిగా గుర్తింపు ఉంది..

Also Read:Political Heat in Visakhapatnam: విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కొత్త ట్విస్ట్..! కూటమిలో కుదరని ఏకాభిప్రాయం..

అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మడం అతిపెద్ద నేరం.. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహాయం చేశారు.. ట్రస్ట్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైసర్ అనే కంపెనీని మధ్యలో బ్రోకరైజ్ చేయడానికి తీసుకున్నారు.. ట్రస్ట్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైసర్ కంపెనీ ద్వారా డబ్బులు తీసుకున్నారు.. తనది కాని భూమిని TGIIC తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు.. రిజిస్ట్రేషన్ పత్రం లేకుండా డబ్బులు ఇచ్చిన వారిది తప్పే.. తీసుకున్న వారిది కూడా తప్పే.. ఏమి చూసుకోకుండా పది వేల కోట్లు ఇచ్చేశారు” అని కేటీఆర్ వెల్లడించారు.

Exit mobile version