KTR: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం..!
- కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమా..
- కాంగ్రెస్ పాలనతో మోసపోయిన వర్గాలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయి..
- జాతీయ రాజకీయాల్లోనూ భవిష్యత్‌లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారు..
- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల అంతర్గత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనతో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు. తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ రాబోయే రోజుల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ శక్తులు దేశంలో కీలకంగా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. నాలుగేళ్ల క్రితం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి గురించి చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాలేదని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన చెప్పింది వాస్తవమని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలిచే విషయంలో కాంగ్రెస్ విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం సంక్షోభంలోకి వెళ్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్‌ను బలోపేతం చేయలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీ రాజకీయ నాయకులను బెదిరించగలిగినా యువతను భయపెట్టలేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ గత పదేళ్లలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కలిసి పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకుండా కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
Also Read
- YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
- YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
తెలంగాణలోని అన్ని వర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని కేటీఆర్ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 2017లో మాదిరిగానే బీఆర్ఎస్ భారీ విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కేవలం ధనబలాన్నే నమ్ముకుందని ఆరోపించారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతో మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
KTR: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం..!
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య