YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖూనీ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తమ పార్టీ తరఫున జరిగిన పరిణామాలను వివరించడంతో పాటు సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసినట్లు తెలిపారు. సుప్రీం ఆదేశాలతో సీఎం చంద్రబాబు, ఎస్ఈసీ, డీజీపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదని, ప్రజలంటే విలువ లేదని విమర్శించారు. ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో జగన్ మాట్లాడారు.
‘స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఘటనలపై ఎస్ఈసీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో వివరించాం. ఎస్ఈసీ, గవర్నర్‌తో పాటు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాం. మా వాదనలు, సాక్ష్యాధారాలతో ఏకీభవించిన సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మొట్టికాయలు కూడా వేసింది. అక్టోబర్ 25వ తేదీ వరకు నామినేషన్ తుది జాబితా విడుదల చేయవద్దు. నామినేషన్ వేయనివ్వని వాళ్లతో అధికారులు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని చెప్పింది. మా పార్టీ వాళ్లతో వాళ్ళు నామినేషన్ వేయనివ్వటం లేదు అని చెప్తున్నాం అంటే వ్యవస్థ ఎంతలా దిగజారిపోయింది. పార్టీ పరంగా జరిగే ఎన్నికల్లో దాపరికమెందుకు?. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చింది’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
Also Read
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
- Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
- CM Revanth: అమర పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..!
‘స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని ఆదేశించింది. ప్రతీ అంశాన్ని సుప్రీం చాలా క్లియర్‌గా చెప్పింది. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపిస్తే ఇదంతా ఉండదు కదా. మీరు ప్రజలకు మంచి చేశామన్న నమ్మకం ఉంటే ఎన్నికలకు వెళ్ళాలి. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్ధులకు రక్షణ కల్పించటంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోర్ట్ ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలను సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. సమాన అవకాశాలు దెబ్బతీస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయని చెప్పింది. సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదు. ఎస్ఈసీ, డీజీపీ, కలెక్టర్లు, డీఐజీలో ఏమైనా మార్పు వచ్చిందా?. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు’ అని జగన్ ఫైర్ అయ్యారు.
‘ఎస్ఈసీకి మేం అనేక ఫిర్యాదులు చేస్తే మైదుకూరు మొత్తం, కడప, తిరుపతి, రాజంపేట 4 చోట్ల పాక్షికంగా నామినేషన్ వేసేందుకు అవకాశం ఇచ్చారు. 19 చోట్ల నామినేషన్లు వేయనివ్వలేదని సాక్ష్యాధారాలతో సుప్రీంకు వెళ్ళాం. చంద్రబాబు, ఎస్ఈసీ ఎవరి కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు. నామినేషన్ వేయకుండా గెలుపును ప్రభావితం చేయాలనుకోవటం ధర్మమేనా?. కడపలో 66 డివిజన్లు ఉంటే 13 చోట్ల మాత్రమే నామినేషన్ వేసేందుకు అవకాశం ఇచ్చారు. దీన్ని ప్రజాస్వామ్యం అంటారు?. రాజంపేటలో 32 వార్డులు ఉంటే 11 వార్డుల్లో మాత్రమే తీసుకుంటారట. వీళ్లు సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తున్నట్లా? లేక చంద్రబాబు ఆదేశాలు పాటిస్తున్నట్లా?. స్క్రూటినీ పేరుతో 23 అర్బన్ లోకల్ బాడీస్‌లో పోటీనే లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అనేకచోట్ల దాడులు చేసి పోలీసులతో నామినేషన్ ప్రక్రియ అడ్డుకున్నారు’ అని వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
-
Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
-
Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య