Site icon NTV Telugu

KTR Review: వర్షాకాలం వచ్చింది.. సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆరా

Ktr

Ktr

వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొ­నే సమస్యలపై మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తం­గా ఉండాలని పురపాల­క, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. మ్యాన్‌హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టిన వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read Also: Rahul Gandhi: ఢిల్లీలో బైక్ మెకానిక్ గా మారిన రాహుల్.. చూసిన ఆశ్చర్యపోతున్న జనాలు

ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలకలతో పాటు హైదరాబాద్‌లో తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల ప్రథమ బాధ్యత అని కేటీఆర్ అన్నారు.. ఆ దిశగా యంత్రాంగం పనిచేయాలని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్‌ పంపులు, ఇతర ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను తెలిపారు.

Read Also: Today Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్స్ ఇవే!

నగరవ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కేటీఆర్‌ ఈ మీటింగ్ లో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉందని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు, వాటి పరిష్కారం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version