KTR: “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక”.. బీఆర్ఎస్ వాదనే నిజమైందన్న కేటీఆర్..
KTR: హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను స్వాగతిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షసాధింపునకు వ్యవస్థల దుర్వినియోగాన్ని తీర్పు ఎండగట్టిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు. “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక” అన్న బీఆర్ఎస్ వాదన నిజమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సహజ న్యాయ సూత్రాలు, నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. కేసీఆర్ ముందే చెప్పిన అంశాలను హైకోర్టు సమర్థించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలను ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
మరోవైపు.. ఈ అంశంపై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. “ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా.. ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
-
Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?