NTV Telugu Site icon

KTR: మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు.. సీఎంపై కేటీఆర్ ఫైర్

Ktr

Ktr

ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించారు. తొలి క్యాబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? అని అన్నారు. తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా? చురకలు అంటించారు. మీరు కొలువుదీరితే సరిపోతుందా..? యువతకు కొలువులు అక్కర్లేదా ? అని అడిగారు. గతంలో మీరు.. ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. తిన్నది అరిగేదాకా అరిచే బీరు, బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారన్నారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారు.. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: PM Modi: “యుద్ధం పరిష్కారం కాదు”.. పుతిన్‌కి ప్రధాని మోడీ సందేశం..

డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు.. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని తెలిపారు. గుర్తుపెట్టుకోండి ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు.. మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం అని ప్రశ్నించారు. మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు.. నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారని అడిగారు. డీఎస్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.

Read Also: Mohammed Siraj: సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..