NTV Telugu Site icon

Breaking: ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్..

Brs Ktr

Brs Ktr

ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం కాసేపటి క్రితం ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ వెళ్లారు. అయితే.. అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు.. లాయర్‌ను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని పోలీసులు తెలిపారు. దీంతో.. లాయర్‌ను అనుమతించకూడదన్న నిబంధన చూపాలని కేటీఆర్ పట్టుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ విచారణకు హాజరుకాకుండానే అక్కడి నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు.

Syria: సిరియాలో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు..

రాతపూర్వకంగా తన స్టేట్‌మెంట్ ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. తన స్టేట్‌మెంట్‌ను ఏఎస్పీకి ఇచ్చానని అన్నారు. రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలు రాస్తున్నారు.. పోలీసులను తాను నమ్మనని చెప్పారు. లాయర్ ఉంటేనే తన హక్కులకు రక్షణ ఉంటుందన్నారు. తన అడ్వకేట్లతో వస్తే వాళ్లకేంటి ఇబ్బంది..? అని కేటీఆర్ ప్రశ్నించారు. అనంతరం అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు.

Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పాదయాత్ర భక్తులకు ఈవో శుభవార్త!

Show comments