KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మానవీయ పాలనకు ‘కళ్యాణలక్ష్మి’ పథకమే నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఉద్యమ సమయంలో ఒక గిరిజన తండాలో స్వయంగా చూసిన ఒక సంఘటన ప్రేరణగా కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణలోని లక్షల కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి సమయంలో కేసీఆర్ మేనమామ లాగా నిలిచారని.. పేద కుటుంబాలకు పెద్ద దిక్కయ్యారన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 1,00,116 కానుకగా అందించాలన్న ఆలోచన కేసీఆర్‌కు తప్ప ప్రపంచంలోని ఏ నాయకుడికి రాలేదని కొనియాడారు. ఆడబిడ్డ పెళ్లి సమయంలో తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడింది. బాల్య వివాహాలను కూడా తగ్గించిందని పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చడమే కాకుండా.. పూర్తిగా రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని.. కళ్యాణలక్ష్మితో పాటు ఇస్తానన్న తులం బంగారం దేవుడెరుగు, అసలు ఈ పథకమే లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి పథకం అమలులోకి వచ్చి ఈ రోజుతో 12 ఏళ్ళు నిండిన శుభ సమయాన… లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?