Site icon NTV Telugu

KTR : సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు.. రేవంత్‌ కు సవాల్‌..

Ktr

Ktr

మేము మేడిగడ్డ వెళ్తుంటే వాళ్ళు పాలమూరు పోతాము అంటున్నారని, సిల్లీ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ రిపైర్లు చేయమంటే చేయట్లేదని, మార్చి 31 లోపు రిపేర్ చేసి నీళ్లు ఇవ్వకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. మీరు చేయలేక పోతే మాకు ఇవ్వండి మేము చేసి చూపిస్తామని కేటీఆర్‌ అన్నారు. మీకు చేత కాకపోతే దిగిపోండి.. హరీష్‌ రావు చెప్పినట్లు నీళ్లు ఎత్తిపోసి చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న హరీష్‌ రావు చెప్పారు…దానికి మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ అన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో ఎంత సిమెంట్, కాంక్రీట్ వాడాలో కేసీఆర్ చెప్పారు అని ఉత్తమ్ కుమార్ అంటున్నారని, కేసీఆర్ ను రాజకీయంగా బదనాం చేయాలని చూస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

USA: టెక్సాస్‌లో చల్లారని కార్చిచ్చు.. భారీగా ఆస్తులు బుగ్గిపాలు

రాజకీయంగా వేధింపులు చేయాలంటే చేయండి.. మేము దేనికి భయపడమన్నారు. ఫస్ట్ రిపేర్ లు చేసి చూపించండని, కాళేశ్వరం కు 400 అనుమతులు వచ్చాయన్నారు. రేవంత్ రెడ్డి అధికారం లో ఉన్నాము అనుకోవడం లేదని, ఇంకా ప్రతిపక్షం లో ఉన్నాము అనుకుంటున్నారని కేటీఆర్‌ చురకలు అంటించారు. ఒక్క ఎన్నికల్లో గెలిస్తే మగాడా.. లేకుంటే కాదా… రేవంత్ ఎదో భయం వెంటాడుతోంది అనిపిస్తుందనారు. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేసి చూపించు అని ఆయన అన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లో ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలిచారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నువ్వు సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరికి వచ్చి పోటీ చేయి చూసుకుందామని, నేను పోటీ చేస్తా.. నువ్వు కొడంగల్ రాజీనామా చేసి రా.. నేను సిరిసిల్ల రాజీనామా చేసి వస్తాను.. మల్కాజిగిరి లో తేల్చుకుందాం… మాకు ఒక్క సీటు రాదు అని రేవంత్ సవాలు విసిరాడు.. నేను కూడా సవాలు విసురుతున్నానని కేటీఆర్‌ అన్నారు.

Calcutta High Court: తృణమూల్ నేత షేక్ షాజహాన్‌పై తమకు “సానుభూతి” లేదన్న హైకోర్టు.. సందేశ్‌ఖలి అఘాయిత్యాల్లో ప్రమేయం..

Exit mobile version