NTV Telugu Site icon

KTR : విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనల్ని ప్రభుత్వం విరమించుకోవాలి

Ktr

Ktr

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ మార్గాల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గృహ అవసరాలకు నెలకు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జ్ ఐదు రెట్లు పెంచాలని భావిస్తోందని, పది రూపాయలు ఉన్న ఛార్జీని 50 రూపాయలు చేయాలని భావిస్తోందన్నారు. ఇళ్ళల్లో 300 యూనిట్లు దాటడం కామన్ గా మారిందని, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని మేము ఈఆర్సి చైర్మన్ కు వినతిపత్రం ఇచ్చామన్నారు. పరిశ్రమలన్నింటిని ఒకే కేటగిరి కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, ఫాక్స్ కాన్ సంస్థ ఇప్పటికే చెన్నైకి వెళ్ళిందని, రైతులు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనపై ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని, ట్రూ ఆప్ చార్జీల పేరుతో 12,500 కోట్లు విద్యుత్ సంస్థలు పెంచాలని చూస్తే కేసీఆర్ తిరస్కరించారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపిందని, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని, ప్రజలను అప్రమత్తం చేసేందుకు మేము ఈఆర్సీకి వినతిపత్రం ఇచ్చామని కేటీఆర్‌ తెలిపారు.

Minister Atchannaidu: మూలపేట పోర్టు నిర్మాణ పనులు పునఃప్రారంభం

అంతేకాకుండా..’గ్రూప్ 1 పై మా పార్టీ తరపున సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాము.. సుప్రీంకోర్టు మా పిటిషన్ ను తిరస్కరించలేదు.. జీవో 29 ద్వారా నష్టం జరుగుతుందని మేము ముందే చెప్పాము.. ప్రశాంతంగా జరగాల్సిన గ్రూప్ 1 పరీక్షలు గందరగోళంలో జరుగుతున్నాయి.. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ జీఓ తీసుకువచ్చారు.. మేము తెచ్చిన జీవో 55 బలహీన వర్గాలకు అనుకూలంగా ఉంది.. జీవో 29పై హైకోర్టులో ఇంప్లీడ్ అవుతాము.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చింది నిరుద్యోగులు.. నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వెళ్లి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. నేను జర్నలిస్టులను అవమానించలేదు.. మూసీని పురిటిలోనే దామగుండంలో చంపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు.. బండి సంజయ్ కి రేవంత్ రెడ్డి రహస్య మిత్రుడు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై రైడ్ జరిగితే ఇప్పటి వరకు ఈడీ నోట్ ఇవ్వలేదు.. బీఆర్ఎస్ వున్నప్పుడు రాష్ట్రంలో ఒక్క సంఘటన జరగలేదు.. కాంగ్రెస్ వచ్చాక ఘటనలు జరుగుతున్నాయి.. ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగితే నేను ట్వీట్ చేస్తే.. ప్రభుత్వం నాకు శాంతి భద్రతల కిందకు వస్తుందని నోటీసు పంపింది… రేవంత్ రెడ్డికి సిగ్గుంటే నువ్వు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలి…’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Minister Atchannaidu: మూలపేట పోర్టు నిర్మాణ పనులు పునఃప్రారంభం