NTV Telugu Site icon

KTR: సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు.. కేటీఆర్ ఫైర్

Ktr

Ktr

KTR: నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారని నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. అదేవిధంగా.. మూసీ పేరుతో లూటీ చేస్తున్నారని, మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని పేర్కొన్నారు. నాచారం, ఉప్పల్ లో మేమే మూసీ సివరేజ్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని, సివరేజ్ ప్లాంట్స్ పూర్తయితే మూసీ దిగువన శుద్ధి చేసిన నీళ్లే వెళతాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: Eatala Rajendar: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉంది

ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నల్గొండకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. బిల్డర్లు, పెద్ద వ్యాపారులను బెదిరించేందుకే హైడ్రాను తీసుకొచ్చారంటూ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. ఈ సమావేశంలో పలువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమ వేశంలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి రేవంత్ సర్కార్ వసూళ్ళకు పాల్పడుతోందని., హైడ్రా పేరుతో వసూలు జరుగుతున్నాయని అందుకు గాను ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ నేతలను కొట్టారని ఆయన అన్నారు. అఖిలపక్షం సమావేశం కాదని.. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో మీటింగ్ పెట్టాలని అన్నారు.

పార్టీల అభిప్రాయాలు కాదు.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని, సీఎం రేవంత్ బీజేపీ ఉన్నారా లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రినా అని ప్రశ్నించారు. ఉన్నట్లుండి రేవంత్ కు దేశరక్షణ గుర్తొచ్చిందని, గతంలో ఆర్మీలో ఏమైనా రేవంత్ పనిచేశాడా? అక్రమ నిర్మాణమైతే.. నా ఫాంహౌస్ ను కొట్టేయొచ్చు కదా అని మాట్లాడారు. పేదల కడుపు కొట్టకుండా మూసీ సుందరీకరణ చేసుకోవచ్చని, సంక్షేమ పథకాలకు లేని నిధులు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు ఎక్కడవని ప్రశ్నించారు. మూసీకి పురిట్లోనే గండి కొట్టి.. హైదరాబాద్ వచ్చి సుందరీకరణ అంటున్నారని, అలాగే దామగుండం నేవీ రాడార్ స్టేషన్స్ ను అమెరికా, యూకే లాంటి దేశాలు వాడటం లేదని తెలిపారు.

Also Read: Maoists Funerals: ఎన్‭కౌంటర్ మృతులకి మావోయిస్టుల అంత్యక్రియలు

పర్యావరణ ప్రేమికుల సూచన మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లై ఓవర్స్ ఆలోచనను విరమించుకున్నామని, దిక్కుమాలని పాలన వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని, సీఎం దివాలాకోరు మాటల వలనే అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల గుర్తుంచుకోవాలని ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డంగా ఉంటారని, కాంగ్రెస్ హాయాంలోనే అనుమతిలిచ్చి.. ఇప్పుడు కూల్చుతున్నాతని డిప్యూటీ సీఎంకు తెలియదా? అని ఆయన అన్నారు.

మరోవైపు మోడీని చూస్తే.. రేవంత్ రెడ్డికి హడల్ అని, మూసీ సుందరీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని ఆయన అన్నారు. నల్గొండపై సీఎం రేవంత్ రెడ్డివి సన్నాయినొక్కులని, ఎవరి కడుపు కొట్టకుండానే.. బీఆర్ఎస్ హాయాంలోనే మూసీ సుందరీకరణ ప్రారంభించామని అన్నారు. మేము కట్టిన శుద్దీకరణ ప్లాంట్లు ఉపయోగించి.. ‌నల్లగొండ నీళ్ళి పంపొచ్చని, దుందుడుకు చర్యలపై క్షేత్రస్థాయి పర్యటనలకు రెడీ అవుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Show comments