KTR: వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్నివంచనతో మళ్లీ సర్కారు ముంచిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు ఇచ్చింది పరిహారం కాదు…పరిహాసమన్నారు కేటీఆర్. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అని., 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా..? పంట నష్టం అంచనాలను తల్లకిందులుగా ఎందుకు మార్చేసారు..? ఏకంగా 3లక్షల 35 వేల ఎకరాలు ఎట్లా ఎగిరిపోయాయి..? 79,574 ఎకరాలకే కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణం అని విమర్శించారు.
Ratan Tata: టీమిండియా క్రికెటర్లకూ అండగా రతన్ టాటా.. ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా!
అపార నష్టంతో అల్లాడుతున్న రైతుల ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా..? మానవత్వం ప్రదర్శించలేరా..? 5.20 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం రిపోర్ట్ ఇచ్చింది నిజం కాదా..? ఇప్పుడు ఇంత భారీ కోతలా? పెట్టిన పెట్టుబడి కొట్టుకుపోయి.. రాళ్లూ ఇసుక మేటలు వేసిన పొలాలను బాగుచేసుకోవడానికి మీరిచ్చే 10వేలు ఏమూలకూ సరిపోవు. మరి అందులోనూ కుదింపులు చేయడం ఏమాత్రం సమంజసం కాదు.. అన్నదాత ఆపదలో వున్నప్పుడు ఆదుకోవడం.. ప్రభుత్వాల బాధ్యతని., ఆ బాధ్యత నుంచి తప్పించుకోకుండా నష్టం వాటిల్లిన ప్రతి ఎకరానికి పరిహారం అందించండని.. రుణమాఫీలో దగా జరిగిందని అన్నారు. రైతు భరోసా జాడా పత్తా లేదు. వరదలు ముంచెత్తి నష్టాల్లో.. కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు అండగా నిలవట్లేదు.. అన్నదాతపై ఎందుకీ వివక్ష..? అని కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున్న విమర్శలు చేసారు.