KTR: కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు కాలేదని నిరూపించుకొండి.. ప్రధానకి ట్వీట్ చేసిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన మోడీకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన పలు అంశాలను పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో పర్యావరణం పైన, ప్రధానిగా తన బాధ్యతల పైన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇదని, కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాల పైన విచారణ చేపట్టి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి లో జరిగిన విధ్వంసం విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం పైన ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కంచ గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10వేలకోట్ల ఆర్థిక మోసం అంటూ పేర్కొన్నారు.
ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిబిఐ, ఆర్బిఐ, సెబి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన పదివేల కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశాము. సుప్రీంకోర్టు పంపించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఈ అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల విభాగాల స్వతంత్ర విచారణ చేయాలని సూచించనాట్లు తెలిపారు. నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని.. అయితే నిసిగ్గుగా, అక్రమంగా వ్యవస్థలను మోసం చేసి పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలో చేసిన పదివేల కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాల పైన వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటిగా కాదని… కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలని ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
Dear Hon'ble Prime Minister @narendramodi ji,
I was heartened to hear your speech about the destruction of Kancha Gachibowli Forest by Telangana CM Revanth Reddy. However, I hope it's not just lip service
The devastation in Kancha Gachibowli is not just a grave environmental… pic.twitter.com/8byfzDwUkR
— KTR (@KTRBRS) April 18, 2025
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!