KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మీ ఢిల్లీ బాసులు, మీ గల్లీ దోస్తులు ఆకలి తీర్చడం కాదు, ముందు మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టాలని సూచించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్, పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు తిండి పెట్టడంలో లేదా? అని ప్రశ్నించారు. అమృత్ స్కీమ్‌ను బామ్మర్దికి అప్పగించే తెలివి ఉందని, కానీ ఆకలితో అలమటిస్తున్న చిన్నారుల కోసం ఆలోచన లేదా? అని నిలదీశారు.
Naga Vamsi: హీరోగా నాగ వంశీ బామ్మర్ది.. హీరోయిన్ ఎవరంటే?
మూసీ ప్రక్షాళన పేరుతో నిధులు ఢిల్లీకి తరలించడంలో ఉన్న శ్రద్ధ, పాఠశాలల మూలభూత అవసరాలపై లేదా? అని ప్రశ్నించారు. మంత్రుల సంగతి పక్కన పెడితే, సీఎం స్వయంగా ఉన్న నియోజకవర్గంలోనే పిల్లలు ఆకలితో ఉన్నారని ఆరోపించారు. ఒక్కరోజు ఫోటోలకు ఫోజులివ్వడం కాక, ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం అందుతున్నదా లేదా అన్నది సమీక్షించాలని సూచించారు. ప్రజలను ఆదుకోవాల్సిన పాలన కష్టాల్లోకి నెట్టే విధంగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
Flight Missing: అమెరికాలో విమానం మిస్సింగ్.. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే..