మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. కాలే యాదయ్య ఏ పార్టీలో ఉన్నారో పక్కనే ఉన్న స్పీకర్ కు తెలియడం లేదని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి జెడ్పిటీసీ కాకముందే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టారు. ఐఏఎస్ అధికారులు ఎగిరెగిరి పడుతున్నారు.. బిఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు అన్నారు.
Also Read:Viveka Murder Case: ఎస్పీని కలిసిన వైఎస్ సునీత.. వైఎస్ వివేకా కేసులో హాట్ కామెంట్స్..
మళ్లీ వచ్చేది మేమే మీ లెక్కలన్ని సెటిల్ చేస్తాము.. ఎవరెవరు ఎగిరిపడ్డారో వారి సంగతి చూస్తాం.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది.. రేవంత్ రెడ్డి అత్తా, కొడళ్లకు మధ్య పంచాయతీ పెట్టిండు.. రేవంత్ రెడ్డి విచిత్రమైన వ్యక్తి రేవంత్ రెడ్డికి సమస్య ఉంది.. కేసీఆర్ పేరు ఎత్తనిది రేవంత్ రెడ్డి మాట్లాడడు.. కేసీఆర్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు.. ఆరోగ్యం డీలా పడింది సెట్ చేసుకుంటున్నారు.. రేవంత్ రెడ్డి నిద్రలో కేసీఆర్ పేరు తలుస్తున్నారు.. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి దోస్తీ డ్రామా.. మోదీతో రేవంత్ రెడ్డి కుస్తీ డ్రామా అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు జలదోపిడీపై ఫైటింగ్ విషయంలో రేవంత్ రెడ్డిది పెద్ద డ్రామా.. పరిగిలో ఏడు మండలాల్లో ఏడు జెడ్పిటీసీలు,ఏడు ఎంపీపీలు బిఆర్ఎస్ ను గెలిపించాలి.. అప్పుడు అధికారులు మనచుట్టూ తిరుగుతారు.. కాంగ్రెస్ చెప్పే 42శాతం కంటే ఎక్కువ సీట్లు బీసీలకు బిఆర్ఎస్ ఇస్తుంది.
