KTR : తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసును కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, ఇరువురి వాదనలు పరిశీలించి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై కేసు నమోదు జరిగింది. ఈ వ్యవహారంపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ కేసులో సరైన ఆధారాలు లేవని, రాజకీయ కోణంలో దీనిని చూచితే సబబుగా ఉండదని కేటీఆర్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.
Nagpur riots: నాగ్‌పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..
హైకోర్టు విచారణ సందర్భంగా, ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. కేసు నమోదైన తరహా, అందులో పేర్కొన్న సెక్షన్లను సమీక్షించిన తర్వాత, ఈ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చింది. దీంతో, సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో కేటీఆర్‌కు ఊరట లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసిన ఈ కేసు, హైకోర్టు తీర్పుతో ముగిసినట్లైంది. ఏది ఏమైనా, ఇటువంటి వ్యాఖ్యల ఆధారంగా కేసులు నమోదు చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
MLA Kunamneni: ఈ బడ్జెట్ నాలుగేళ్లకు పెట్టరా.. ఒక్క ఏడాదికి పెట్టరా తెలియదు..