NTV Telugu Site icon

KTR : మా వాళ్ళు తిరగబడితే కాంగ్రెస్ గుండాలు ఒక్కరు కూడా మిగిలే వారు కాదు..

Ktr

Ktr

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిశారు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారన్న నాయకులు మండిపడ్డారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరం పైన దాడి చేయడం టెంట్ పీకి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతుందని, చట్టానికి వ్యతిరేకంగా పోలీసులను వాడుకుంటూ శాంతి భద్రతలను నాశనం చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలపై సోషల్ సర్వీస్ చేసే వారి మీద, రైతుల మీద దాడులు, జర్నలిస్ట్ ల మీద దాడులు జరుగుతున్నాయని, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో శాంతి యుతమైన ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ గుండాలు, పోలీసులు భాగస్వామ్యం తోనే దాడులు జరిగాయన్నారు జగదీష్‌ రెడ్డి. రాష్టంలో శాంతి భద్రతలకు విఘతం కలుగుతుందన్నారు. అనంతరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రుణ మాఫీ పేరిట మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద శాంతియూతంగా నిరసన చేపట్టామని, ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు పాల్గొన్నామన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో రైతుల రుణ మాఫీ పై నిరసన తెలుపుతున్న నేపథ్యంలో నిరసన శిబిరం పై దాడులు చేసారని, మా వాళ్ళు తిరగబడితే కాంగ్రెస్ గుండాలు ఒక్కరు కూడా మిగిలే వారు కాదని, స్థానిక పోలీసులు గుండాలకు వత్తాసు పలికారన్నారు.

 
UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
 

అంతేకాకుండా..’గల్లీ అవస్థలు వదిలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. 20 వ సారి ఢిల్లీ పోయాడు.. ముఖ్యమంత్రి సొంత గ్రామం లో న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్ట్ ల మీద దాడి చేసారు.. వెల్డండి పోలీస్ స్టేషన్ వరకు మహిళా జర్నలిస్ట్ లను వెంబడించి దాడి చేసారు. ఇద్దరు జర్నలిస్ట్ లను అవమానిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డి మగాడివి అయితే సెక్యూరిటీ లేకుండా బయట కు రా… రుణ మాఫీ ఎక్కడ కూడా కాలేదు.. ఇవ్వన్నీ అంశాల పై డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేసాం.. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. వారి మీద 302 కేసులు నమోదు చేయాలనీ కోరుతున్నాం.. మహిళా జర్నలిస్ట్ లపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి.. పోలీసులను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడు. రాష్ట్రములో శాంతి భద్రత లు అదుపుతాపుతున్నాయి. డీజీపీ గారు అన్ని పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారా.. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీనేవద్దని మేము 10 ఏళ్ళు స్వచ్ఛందంగా పరిపాలించాము. Ftl, బఫర్ జోన్ లో ఉన్న ఫామ్ హౌజ్ లను ముందు కూలగొట్టండి. Ftl లో ఉన్న వివేక్, పొంగులేటి, గుత్తా, పట్నం మహేందర్ రెడ్డి, కెవిపి ఫామ్ హౌజ్ లను కూలగొట్టండి.. ఆ తర్వాత మిగతా వాటి సంగతి చూడండి.’ అని కేటీఆర్‌ అన్నారు.

Viraji: ఆహా అనిపిస్తున్న “విరాజి”