NTV Telugu Site icon

KTR : రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే

Ktr

Ktr

వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అని బీఆర్‌ఎస వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. వానాకాలం పంట సీజన్‌ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని, లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు కేటీఆర్‌. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగిందని, ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారన్నారు. మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదని, సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వీపు చింతపండు చేస్తారన్నారు కేటీఆర్‌. ఎద్దు ఏడ్చినా ఏవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తప్పదన్నారు.

Group-1 Aspirants : సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అంతేకాకుండా..’రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు…మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ? పేదల కడపు కొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయా? మీరుచెప్పినట్లు రైతులకు ఎకరానికి రూ. 7500 ఇచ్చేందుకు పైసలు లేవా? ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ముట్టడిస్తాం. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ వదిలేది లేదు.’ అని కేటీఆర్‌ అన్నారు.

Amaravati: రాజధాని పనుల పున:ప్రారంభంపై సీఎం చంద్రబాబు ట్వీట్