‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన కృతి శెట్టికి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్నా ఈ బ్యూటీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కార్తితో చేసిన ‘వా వాతియార్’ సినిమా పదే పదే వాయిదా పడటం, ప్రదీప్ రంగనాథన్‌తో చేస్తున్న ‘LIK’ కూడా పోస్ట్‌పోన్ కావడంతో కృతి తీవ్ర నిరాశలో ఉంది. పోనీ బాలీవుడ్‌లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామని ముంబైలో ఆడిషన్స్ ఇచ్చిన ఈ చిన్నది, అక్కడ కూడా చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఒక హిందీ ప్రాజెక్ట్ కోసం కృతి శెట్టి పేరు దాదాపు ఖరారైనప్పటికీ, కానీ అనూహ్యంగా ఆమె స్థానంలోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : Peddi-Paradise: బాక్సాఫీస్ దగ్గర సస్పెన్స్.. మార్చి రేసు నుండి చరణ్, నాని అవుట్?
కృతి శెట్టికి రావాల్సిన ఆ బాలీవుడ్ అవకాశాన్ని మహానటి కీర్తి సురేష్ దక్కించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా ‘బేబి జాన్’ సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించిన కీర్తి, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా క్రేజీ ఆఫర్లను మాత్రం వదులుకోవడం లేదు. తెలుగు, హిందీ భాషల్లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తూ కీర్తి సురేష్ దూసుకుపోతుండగా, కృతి శెట్టికి మాత్రం బాలీవుడ్ ఎంట్రీకి కూడా బ్రేక్ పడటం చర్చనీయాంశమైంది. అన్నీ కుదిరి ఈ ఆఫర్ కనుక కృతికి దక్కి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
