NTV Telugu Site icon

KRMB: జీతాలు చెల్లించలేని పరిస్థితిలో కేఆర్‌ఎంబీ.. నేడు బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం

Krmb

Krmb

KRMB: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. బోర్డు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి కేఆర్ఎంబీ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో బోర్డు చైర్మన్‌ శివనందన్‌కుమార్‌ రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు పరిస్థితిని వివరిస్తూ లేఖలు రాశారు. ‘బోర్డు నిర్వహణ కోసం క్రమం తప్పకుండా కేటాయించాల్సి నిధులు గత రెండేళ్లుగా ఇవ్వడం లేదు. బోర్డును మూసేసుకోవడం మినహా గత్యంతరం లేదు’ అంటూ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ లేఖ రాశారు.

Read Also: Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్

ఈ క్రమంలోనే బడ్జెట్‌పై నేడు కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోర్ఢు నిర్వహణకు నిధుల చెల్లింపుపై చర్చించనున్నారు. హైదరాబాద్‌ జలసౌధ ప్రాంగణంలోని కేఆర్‌ఎంబీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిధుల విడుదలపై బోర్డు, రెండు తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ 11 కోట్ల తొమ్మిది లక్షలు, తెలంగాణ 19 కోట్ల 64 లక్షల రూపాయలు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. కృష్ణా జలాలను కేఆర్‌ఎంబీ నియంత్రణలోకి తీసుకోవడాన్ని మొదటి నుంచి తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం సమర్థించింది.