Krishna Janmabhoomi-Shahi Eidgah: మథుర షాహీ ఈద్గా కేసులో జులై 20న విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఓ వైపు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతోంది. జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు హిందూ దేవాలయం అని తమకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్ వేయడంతో వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశించింది. తాజాగా దీనిపై అంజుమన్ ఇంతేజామియా సుప్రీంలో పిటిషన్ వేయగా.. శుక్రవారం సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వారణాసి జిల్లా కోర్ట్ కు కేసును బదిలీ చేసింది. వీడియో సర్వేలో దొరికిన శివలింగాన్ని రక్షించాలని… ఆదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే తాజాగా కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం ప్రస్తుత వార్తల్లోకి చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ మథుర ఉన్న కత్రా కేశవ్ దేవ్ ఆలయ భూమి, షాహీ ఈద్గా వివాదాన్ని విచారించేందుకు ఇటీవల మథుర కోర్ట్ అంగీకరించింది. కత్తా కేశవ్ దేవ్ ఆలయ పరిధిలోని 13.37 ఎకరాల భూమిపై ఈ వివాదం చెలరేగింది. దేవాలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ మసీదును తొలగించాలని గోపాల్ బాబా 2021 సెప్టెంబర్ 20 మథుర సివిల్ జడ్జ్ ( సీనియర్ డివిజన్) కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Also Read
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
ఇదిలా ఉంటే కోర్ట్ జూలై 20న ఈ కేసు తదుపరి విచారణ తేదీగా నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ బార్ కౌన్సిల్ శుక్రవారం నోవర్క్ కాల్ ఇచ్చినందున ఈ కేసును జూలై 20కి వాయిదా వేసింది. మథుర జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేసును అదనపు సివిల్ జడ్జ్ ( ఫాస్ట్ ట్రాక్) నీరజ్ గౌండ్ కు బదిలీ చేసింది. యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, ఇంతేజామియా కమిటీ, షాహీ మసీదు ఈద్గా, శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌లు ఈ కేసులో వాద-ప్రతివాదులుగా ఉన్నారు.
ఇప్పటి వరకు శ్రీ కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంపై మసీదును మార్చాలనే డిమాండ్ పై 11 పిటిషన్లు మథురలోని వివిధ కోర్టుల్లో దాఖలు అయ్యాయి. శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయాన్ని అనుకుని ఉన్న షాహీ మసీదులో ప్రార్థనలను నిషేధించాలని పలు పిటిషన్లలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!