ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో.. మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతే.. జిల్లాలో రేపు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం అయిందని తెలిపారు. మరోవైపు.. పోలింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.…