Site icon NTV Telugu

Drug Case: కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులతో సంబంధాలపై ఆరా

Kp Chowdary

Kp Chowdary

తెలుగు సినీ పరిశ్రమలో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కబాలీ మూవీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. రిమాండ్ రిపోర్టులో 14 మంది పేర్లను పోలీసులు పేర్కొన్నారు. వాళ్ల గురించి ఆరా తీస్తున్నారు. కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు గుర్తించిన పోలీసులు.. దానికి తగిన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సోషల్ మీడియాలో రియాక్ట్ అవున్నారు.

Read Also: LIC Super Policy: ఈ ఎల్ఐసీ పాలసీతో రూ.4 లక్షలు ఆదాయం.. మహిళలకు మాత్రమే…

కేపీ చౌదరితో తమకు ఎలాంటి సంబంధం లేదని పలువురు యాక్టర్లు పేర్కొన్నారు. కేపీ తో ఫ్రెండ్షిప్ తప్ప డ్రగ్స్ కు సంబంధం లేవని చెప్తున్నారు. అయితే, కేపీ డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేపీ వాట్సాప్ డాటాను పోలీసులు రీట్రైవ్ చేశారు. సినీ ప్రముఖులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. ఇప్పటికే 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

Read Also: Varalakshmi Sarathkumar :నా వాయిస్ బాగోలేదంటూ నాకు డబ్బింగ్ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు..

పోలీసులు మాత్రం కేపీ చౌదరి కాల్ డేటాతో పాటు.. ఆయన బ్యాంక్ ఖాతాలో అనుమానస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇందులో ఎవరెవరికి సంబంధం ఉంది అనే కోణంగా ఎంక్వైరీ చేస్తున్నారు. కేపీ చౌదరిని ఇప్పటికే పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. అతను ఇచ్చిన పార్టీలో ఎవరెవరు ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో పలువురు ప్రముఖ సినీ నటుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Exit mobile version