Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao-KTR: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, కేటీఆర్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన జయశంకర్ జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పోరాడారని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలనే సంకల్పంతో జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. జయశంకర్ సేవలను గౌరవిస్తూ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టడంతో పాటు ప్రతి ఏటా అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పయనించడమే మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది” అన్నట్లుగా జయశంకర్ సార్ జీవితం సాగిందని కొనియాడారు. ఉద్యమ సారథి కేసీఆర్‌కు గురుతుల్యులైన జయశంకర్ ప్రజల్లో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉద్యమ చైతన్యం రగిల్చిన దిక్సూచి అని అభివర్ణించారు. భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు నామకరణం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మహనీయుడిని తగిన రీతిలో గౌరవించుకుందని స్మరించుకున్నారు.
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్… తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ సార్.
పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది, అనే చందాన జయశంకర్ సార్ జీవితం సాగింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
ఉద్యమ సారథి కేసీఆర్… pic.twitter.com/wbzEEw3Pey
— KTR (@KTRBRS) August 6, 2026
తాజావార్తలు
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!