NTV Telugu Site icon

Supreme Court: కోటా ఆత్మహత్యలకు సంబంధం లేదు.. నీట్ పిటిషన్లపై చురకలు

Neet

Neet

నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగలేదని, పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు భావోద్వేగ వాదనలు చేయవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. కోటాలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు చేసిన ఆరోపణలపై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Ayodhya: “అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తాం”..జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపు

కోటాలో ఆత్మహత్యలు నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల జరగలేదని వ్యాఖ్యానించిన జస్టిస్ నాథ్, “ఇక్కడ అనవసరమైన భావోద్వేగ వాదనలు చేయవద్దు” అని సూచించారు. ఆ తర్వాత సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ప్రతిస్పందన దాఖలు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ని ఆదేశించగా, ఇతర ప్రతివాదులు (కేంద్రం) తదుపరి విచారణ తేదీ జూలై 8కి వాయిదా వేసింది. నీట్‌ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్‌ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని స్పష్టం చేసింది. బిహార్‌లో నీట్ ప్రశ్నాపత్నం లీకైనట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ తాజా రికార్డ్ ఇదే

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నీట్‌ పరీక్షలో పేపర్‌ లీక్‌, ఇతర అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. దీంతో ఈరోజు విచారణ చేపట్టారు. కాగా.. ఈ ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు మొదటి ర్యాంక్‌ రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో.. 1563 మంది విద్యార్థుల గ్రేస్‌ మార్కులను రద్దు చేస్తున్నట్లు గురువారం కేంద్రం, సుప్రీంకోర్టు తెలిపింది.