Kota Bommali : ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని ముఖ్యతారలుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బ్లాక్‌బస్టర్ చిత్రంగా విజయపథంలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే మీడియా తప్పకుండా ప్రోత్సహిస్తుందనే విషయాన్నీ ఈ చిత్రానికి వారు అందిస్తున్న సపోర్టుతో మరో సారి ప్రూవ్ అయింది. నాయట్టు అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో కమర్షియల్ హంగులతో చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త భయపడ్డాను. కానీ ఈ రోజు మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది. నిజాయితీగా సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మార్నింగ్ వసూళ్లు తక్కువ వున్నా ఫస్ట్ షో టైమ్‌కు మౌత్‌టాక్ తో కలెక్షన్లు పెరిగాయి. ఇదే మా సినిమా సక్సెస్‌కు నిదర్శనం. ఓ మంచి సినిమా తీశాను అది జనాలకు నచ్చిందనే విషయాన్ని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. తేజ మార్ని ఎంతో ప్రతిభ గల దర్శకుడు. ఈ రోజు చిత్రంలో ప్రతి సన్నివేశానికి క్లాప్స్ పడుతున్నాయంటే అతనే కారణం. భవిష్యత్‌లో అతను మంచి కమర్షియల్ దర్శకుడిగా ఎదుగుతాడు. శ్రీకాంత్ అన్నయ్య సొసైటీకి ఉపయోగపడే పాత్ర ఎప్పూడు చేసిన ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. తప్పకుండా ఈ చిత్రం మరింత జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది* అన్నారు.
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ మీడియా మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే ఆనందంగా వుంది. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోదన రోజులు గుర్తొచ్చాయని అందరూ అంటున్నారు. ఈ మధ్యకాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్రశంసలు రాలేదు. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ వున్న నిర్మాతలు కావాలి. ఆ గట్స్ నాకు వాసు, విద్యలో కనిపించాయి. మొదట్లో ఈ చిత్రంలో నా పాత్రను చేయగలనా అనుకున్నాను. కానీ ధైర్యంగా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. నా కెరీర్‌ను మలుపుతిప్పిన గీతా ఆర్ట్స్ సంస్థలో మళ్లీ నాకు మరో మంచి సక్సెస్ రావడం సంతోషంగా వుంది. ఈ చిత్ర దర్శకుడు తేజ గొప్ప దర్శకుడుగా ఎదుగుతాడు అన్నారు. ఎంతో కష్టపడి , అందరి సహకారంతో చేసిన ఈ సినిమాకు ఈ రోజు ఇంత మంచి ఆదరణ దొరకడం హ్యపీగా వుందని దర్శకుడు తేజ మార్ని తెలిపారు. శివాని మాట్లాడుతూ సినిమాలో నా నటన గురించి అందరూ అమ్మకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మంచి కంటెంట్‌తో సినిమ తీస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పూడు ఆదరిస్తారని ఈ చిత్ర విజయం మరోసారి నిరూపించింది. మౌత్ టాక్‌తో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతుంది. ఇదే ఈ చిత్ర సక్సెస్‌కు నిదర్శనం అన్నారు. హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ ఇదొక నిజాయితీ అంటెప్ట్. సొసైటిలో జరుగుతున్న దానికి రిఫ్లక్షన్ ఇది. శ్రీకాంత్ గారి పాత్ర నా కళ్లలో నీళ్లు తెప్పించింది. నా పాత్రకు కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి అన్నారు. సినిమా విజయం పట్ల సహ నిర్మాత భాను తన ఆనందాన్ని తెలిపారు.
తాజావార్తలు
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!