ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూన రవికుమార్ మాట్లాడుతూ.. నాపై కెజిబివి ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారు.. సభ్య సమాజం ఆమె ఆరోపణలు చూసి తలదించుకునే విధంగా ఉన్నాయి.. జెడ్పిటిసి నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించాను.. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం దారుణం.. వైసీపీ తోక నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నేను శారీరకంగా మానసికంగా హింసించినట్టు ఆధారాలు చూపించు.. తల్లిదండ్రుల ఫిర్యాదులు వస్తే ఎమ్మెల్యే గా ఎవరితోనైనా మాట్లాడతాను.. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. తప్పు చేసి ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే అని అన్నారు.
Also Read:Priyanka Gandhi : ఓటు చోరీపై నిజాలు బయటపెట్టండి
నేను అందరి ప్రిన్సిపల్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను.. సాక్షి మీడియా చెత్త రాతలు రాస్తుంది.. అడ్మిషన్స్ విషయంలో తల్లిదండ్రుల కోరిక మేరకు ఆమెతో మాట్లాడి ఉంటాను.. ఎమ్మెల్యే తో వీడియో కాన్ఫరెన్స్ కు ఆమె ఏ విధంగా హాజరయ్యిందో చూస్తే అర్ధమౌతుంది.. జూన్ 2 న స్కూల్ తెరవకుండా 12 న ఓపెన్ చేసారు.. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా అధికారులకు చర్యలు తీసుకోమని కోరాను.. బదిలీ చేస్తే వేధింపులు ఎలా అవుతాయి.. పొందూరు కెజిబివిలో జాయినింగ్ కి వచ్చిన కొత్త ప్రిన్సిపల్ ను సౌమ్య బెదిరించారు.. అక్కడ విధుల్లో జాయిన్ అవ్వవద్దు అంటూ బ్లాక్ మెయిల్ చేశారు.. నాపై నిరాధార ఆరోపణలు చేసిన సౌమ్యతో పాటు వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేస్తాను.
Also Read:CM Revanth Reddy : చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసద్‌కు విజ్ఞప్తి చేస్తున్నా
అసెంబ్లీ ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాను.. వైసీపీ బ్లూ ఫిల్మ్ పార్టీ.. గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు లా గుడ్డలు విప్పి చూపించలేదు.. నా కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే తాట తీస్తా.. నా నీడ కూడా తాకలేని గల్లీ వైసీపీ నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నాపై ఆరోపణలు చేస్తున్న మహిళకు కులం పేరిట బ్లాక్ మెయిల్ చేయటంలో సిద్ధ హస్తురాలు.. పనికిమాలిన కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారు.. ఇలాంటి కుట్రలు నన్ను ఏమి చేయలేవు.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం…ఏనాడూ నీచ రాజకేయాలు చేయలేదు.. నాపై నిరాధార ఆరోపణలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.