CM Revanth Reddy : చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసద్‌కు విజ్ఞప్తి చేస్తున్నా
- ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించడం హర్షణీయం
- ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
- రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి
- చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసద్‌కు విజ్ఞప్తి చేస్తున్నా
- రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయకోవిదుడు అవసరం
- జస్టిస్ సుదర్శన్ రెడ్డి మా పార్టీ ప్రతినిధి కాదు -సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ .. “జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మా పార్టీ ప్రతినిధి కాదు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయకోవిదుడు అవసరం. చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసదుద్దీన్ తదితర నాయకులు కూడా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించేందుకు మద్దతు ఇవ్వాలి” అని విజ్ఞప్తి చేశారు.
Anakapalli: ఏపీ హోంమంత్రి అనిత నియోజకవర్గంలో భారీగా గంజాయి పట్టివేత!
Also Read
అలాగే NDA అభ్యర్థి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని, రిజర్వేషన్లు రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతాయని హెచ్చరించారు. “మహారాష్ట్రలో లక్షలకొద్దీ కొత్త ఓటర్లు నమోదవడం ఆందోళన కలిగించే విషయం” అని అన్నారు. “ఆత్మప్రబోధంతో ఓటు వేయండి. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రతిపాదించారు. ఆయన నిజంగా బీసీల గొంతుక. ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు బలహీన వర్గాలకు ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలంటూ సూచనలు చేశారు” అని గుర్తుచేశారు. నామినేషన్ అనంతరం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అందరి సలహాలు తీసుకుని ప్రచారం ముందుకు తీసుకువెళ్తారని సీఎం తెలిపారు. “తెలుగు ప్రజలంతా కలిసి NTR లాగ స్ఫూర్తి పొందుతూ సుదర్శన్‌రెడ్డిని గెలిపిద్దాం” అని రేవంత్ పిలుపునిచ్చారు.
KCR-Harish Rao : కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?