Konda Vishweshwar Reddy: 95 శాతం ఉద్యోగులు మా వెంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులు సైతం భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ (బుధవారం) ఉదయం ఆయన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం స్థానిక సిర్పూర్ యాదయ్య ప్లే గ్రౌండ్లో వాకర్స్ తో సమావేశం అయ్యారు.. బీజేపీకి మద్దతు తెలప్పాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో 95 శాతం మంది బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వం మంచి స్కీంలను అందించిందని ఆయన గుర్తు చేశారు.
Read Also: Pushpa 2 : ఆ ప్రముఖ బ్యానర్ కు దక్కిన పుష్ప 2 కేరళ రైట్స్..?
Also Read
కాగా, ఇదే హవా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ లోనూ కనిపిస్తుందని కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు నరేంద్ర మోడీ ముందు నిలవలేక పోతున్నాయి.. అందుకనే వ్యక్తిగత విమర్శలు తప్పుడు వీడియోలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందనే విషయం అర్థమైపోతుందన్నారు.
Read Also: Maharashtra: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..
ఇక, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి జోరుగా ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆమె చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని కలుస్తూ మే 13వ తేదీన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు లక్షల భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అటు నరేంద్ర మోడీ ఇటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రజా నాయకులని, నిస్వార్థంగా, అవినీతి రహిత పాలన అందిస్తారని కొండ సంగీత రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను చేవెళ్లలో విజయవంతంగా అమలు చేయడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం అనివార్యమన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?