గత కొన్ని రోజులుగా బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు పార్టీ లు మారారు… కానీ బీజేపీ అలా జరుగదన్నారు. అంతేకాకుండా.. నేను బీజేపీలోనే కొనసాగుతానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మా గురించి మేము ప్రచారం చేసుకోవడం లేదని, ఒక రాజకీయ పార్టీ ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. కవిత అరెస్టు ఎప్పుడు అనేది మా చేతిలో లేదని ఆయన అన్నారు. బీజేపీ అంతా సెక్యులర్ పార్టీ దేశంలో లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెటైర్ వేశారు. ఆర్ఎస్ఎస్ తెలంగాణలో పుట్టిందని, సిద్ధాంతంకు కట్టుబడి ఉన్న పార్టీ కేవలం బీజేపీ మాత్రమేనన్నారు. ప్రజలకు ఇంకా బీజేపీపై నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Gold Standard Burger: ఈ బర్గర్ ధర రూ. 55,000.. ఎందుకంత స్పెషల్..?
ఓ నాయకుడు భారత్ జోడో యాత్ర చేసి.. కశ్మీర్ కు వేరే కోడ్ ఉండాలని అంటాడు. ఇది అసలైన కన్ఫూజన్. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలు లేకుండా వ్యవహరించే కాంగ్రెస్సే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ అని అంటారు. అలాగే బీఆర్ఎస్ ఉన్నోళ్లంతా.. ఒకప్పటి తెలంగాణ వ్యతిరేకులేనని, ఆంధ్రను అడ్డగోలుగా విమర్శించారని గుర్తుచేశారాయన. వీటిల్లో ఏ పార్టీ కూడా సవ్యంగా లేదని.. అవి రియల్ కన్ఫ్యూజ్డ్ పార్టీలనీ అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Also Read : Manchu Vishnu: స్టార్ కమెడియన్ ఇంట్లో నోట్ల కట్టలు.. గుట్టు బయటపెట్టిన మా ప్రెసిడెంట్