Site icon NTV Telugu

KondaSurekha: వివాదాస్పద వ్యాఖ్యలపై కొండా సురేఖ క్లారిటీ..

Konda Surekha

Konda Surekha

ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొన్ని రోజుల క్రితం తమ బంధువుల అబ్బాయికి ఉద్యోగం కావాలని మంత్రి శ్రీధర్ బాబును కోరడం ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మంత్రులు కమిషన్ తీసుకుంటారు అనే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే?

Also Read:Heavy Rain Forecast: దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..

కొండా సురేఖ మాట్లాడుతూ.. సీఎస్ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు చేస్తున్నాం.. మంత్రులు మాత్రమే కమిషన్ తీసుకుంటారు అని మంత్రమే చెప్పాను.. కాంగ్రెస్ మంత్రులు అని నేను అనలేదు.. బీఅర్ ఎస్ పెయిడ్ వాళ్ళు కావాలని దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీఅర్ ఎస్ నేతలు కమిషన్ తీసుకొని పనులు చేశారు.. గతంలో బీఅర్ ఎస్ పార్టీలో మంత్రులుగా పని చేసిన వాళ్ళు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి.. మంత్రి కాకముందు మీ అస్తులు ఎంత?ఇప్పుడు మీ అస్తులు ఎంత పెరిగిందో ఎంక్వయిరీ చేయించండి.. నిజాలు బయటకు వస్తాయన్నారు.

Also Read:KTR: అమెరికాకు ఎమ్మెల్సీ కవిత.. హరీశ్ రావు నివాసానికి కేటీఆర్..

గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్ తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు పేదలకు మాత్రమే అందాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది.. కాంగ్రెస్ కార్యకర్తలకి అందాలని ఎక్కడ కూడా లేదు. అర్హులకు మాత్రమే పథకాల అందుతున్నాయి.. ఇలా పారదర్శకంగా ప్రభుత్వం నడుపుతుంటే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. సెక్రటేరియట్ ను చెడగొట్టిపోయారు.. సెక్రటేరియట్లో మేము ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉండేది.. ఈ పరిస్థితులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.

Also Read:BrahMos: చైనా, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్ ముందు సరిపోవు: యూఎస్ నిపుణుడు.

ప్రతి చిన్న ఫైల్ కి డబ్బులు తీసుకునే తీరుగా సెక్రెటరీ తయారయింది.. మంత్రులు తప్పు చేశారని ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు వెంటనే ఆపకపోతే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తాను ..బీఆర్ఎస్ వాళ్లు మేము ఏది మాట్లాడినా భుతుగా చూస్తున్నారు.. కవిత ఏమండీ నాకు ఇల్లెలేదు అన్నారు.. మరి కవిత కి ఇంత పెద్ది ఇల్లు ఎలా వచ్చింది.. కేటీఆర్ కి ఇల్లు లేదు అన్న కేటి అర్ కి ఫార్మా హౌజ్ ఎలా వచ్చింది.. అవినీతికి పాల్పడకుండా ఇంత ఆస్తి ఎలా వచ్చింది.. కాళేశ్వరంలో ఏమీ కాలేదు కేవలం పగులు వచ్చింది అంటున్నారు.. కానీ అక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి లేదు.. ఇలా అవినీతికి పాల్పడి మా మీదా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దీన్ని సహించేది లేదు అని బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version