Konda Murali: తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కొండా సురేఖ ఎపిసోడ్ తీవ్ర దుమారం రేపుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కొండా మురళి రాయబార యత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరుకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. కొండా సురేఖ, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానంతో పాటు పార్టీ ముఖ్య నేతలు, పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కఠిన నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు, సయోధ్య కుదిర్చే దిశగా భట్టి విక్రమార్క సమక్షంలో రాజగోపాల్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాయబారం ఫలించి వివాదం సర్దుమణుగుతుందో లేక అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలకే మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..

Konda Bhatti
