సంగారెడ్డి ప్రజా పాలన సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన వెళ్ళాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, గత ప్రభుత్వంలో జనం సమస్యలు చెప్పుకునే అవకాశం లేదన్నారు కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి సందేశం ప్రజలకు వినిపించిన తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని, అధికారులు తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, IAS, IPS అధికారులకు పనితనాన్ని బట్టే ప్రమోషన్లు ఉంటాయని సీఎం చెప్పారు.. బాగా పని చేయండన్నారు. మేం పాలకులం కాదు సేవకులమని ఆమె వ్యాఖ్యానించారు. ఇల్లు అలకగానే పండగ కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిన..ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కృషి చేస్తున్నామన్నారు కొండా సురేఖ.
Also Read : Jagapathi Babu: ఖాన్సార్ లో కొత్త నిబంధన.. రాజమన్నార్ హుకుమ్
మాది కమాండ్ గవర్నమెంట్ కాదు…ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఆమె అన్నారు. ప్రోటోకాల్ పాటిస్తాం… ప్రజాపాలన ఫ్లెక్సీలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫోటోలే ఉంటాయి. ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టమని ఆమె స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అంటే అందరి ఫోటోలు ఫ్లెక్సీలో ఉండవని, గత ప్రభుత్వంలో డబుల్ రూమ్ ల విషయంలో అవినీతి జరిగిందన్నారు. రైతు బంధు కూడా దుర్వినియోగం అయ్యింది..అందుకే సీఎం పెండింగ్ లో పెట్టారన్నారు. కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వంలో ఉండవు..మాకు అవసరం లేదన్నారు కొండా సురేఖ. అసెంబ్లీలో మీకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చామని, మేం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలేదు..అప్పుడే మాపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ శ్వేత పత్రం నిజం… బీఆర్‌ఎస్ స్వేద పత్రం అబద్దమన్నారు. మేం రాష్టంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని తెలియజేశాం..వాళ్లేమో అన్ని అబద్ధాలు చెప్పారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని BRS వాళ్ళు పగటి కలలు కంటున్నారన్నారు. బీఆర్‌ఎస్ వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని, అది జరగని పని ఇంకో 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామన్నారు.
Also Read : Success Story : ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి.. డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న యువరైతు..