కొండా మురళి మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. వరంగల్‌లోని రత్న హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండ మురళి మాట్లాడుతూ.. అమెరికాలో బొల్లుకడిగిన కేటీఆర్‌కు కొండా మురళి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎన్నికలు దగ్గరపడున్న సందర్బంగా మాయమాటలు చెప్పడం మానాలని హితవు పలికారు. టెక్స్‌టైల్స్ పార్క్ భూసేకరణలో రైతులకు న్యాయం జరగలేదని కొండా మరళి వ్యాఖ్యానించారు. పరకాలలో ఎవరికి దమ్ములేదో నీ తండ్రి కేసీఆర్ కి తెలుసు అన్నారు. మేము పరకాలలో పోటి చేస్తా అంటే కేసీఆర్ కావాలనే వరంగల్ లో పోటీ చేయించారని, కలెక్టరేట్ కార్యాలయం గీసుగొండలో పెట్టడానికి స్థలం ఇస్తాను అన్న.. సెంట్రల్ జైలును కుదవ పెట్టిన ఘనత కేసీఆర్‌దే అని ఆయన విమర్శలు గుప్పించారు. ధర్మారెడ్డికి ఎదురు లేదు అని చెప్పిన కేటీఆర్ వరంగల్ లో నరేందర్ కి ఎదురులేదు అని ఎందుకు చెప్పలేదన్నారు. కర్ణాటకలో ఎలా కాంగ్రెస్ గెలిచిందో అదే తెలంగాణలో జరుగుతుందని, కొండా మురళి రౌడీ అయినప్పుడు గతంలో టికెట్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
Also Read : Poonam Bajwa : అదిరిపోయే అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా..!!
గ్యాస్ నూనె, బియ్యం అమ్ముకునే మంత్రి దయాకర్ కంటే తెలంగాలలో చదువుకున్నవాళ్ళు చాలా ఉన్నారని, ఆటోలపై ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేస్తున్న గుడిమల్ల రవి కుమార్ దళితులకు మాత్రం ఎలాంటి హామీలు ఇవ్వలేక పోయావన్నారు. కొమ్మల లక్ష్మి నరసింహ స్వామికి మీసాలు ఉంటాయి, కొండా మురళికి కూడా ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయుల వంశంలో పుట్టినోళ్లు మాత్రమే మీసాలు మెలేస్తారు. ధర్మారెడ్డి నలుగురు గన్‌మెన్ లు లేకుండా రోడ్లమీదకి రా ఎవరు ఏంటో తెలుస్తుంది. తూర్పులో కొండా సురేఖను గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు. నేను తూర్పులో ఉంటా, పరకాల లో ఉంటా. నా పేరు పలికే ధైర్యం కేసీఆర్ కుటుంబంకు లేదు. పేదలకు సాయం చేసే చరిత్ర కలిగిన నన్ను రౌడీ అనడం సిగ్గుచేటు. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ప్రతి ఒక్క రూపాయి వసూలు చేసి పేదలకు పంచుతా.’ అని కొండా మురళి వ్యాఖ్యానించారు.
Also Read : Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?