Komuravelle: పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komuravelle: సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య నిన్న రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. కొమురవెళ్లి ఎస్ఐ నాగరాజు రెండేళ్లుగా తనతో కాపురం చేయడంలేదని భార్య మానస ఆరోపించారు. ఇద్దరి పిల్లల్ని దూరంగా ఉంచి నేను చనిపోయినట్టు చెప్పి దూరం పెట్టారన్నారు. వేరోక మహిళను పెళ్లి చేసుకున్నందుకే తనను దూరం పెట్టాడని ఎస్ఐ నాగరాజు భార్య ఆరోపిస్తున్నారు. తనకి న్యాయం చేసి తన ఇద్దరి పిల్లల్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట మానస ఆందోళనకి దిగారు.
Read also: Samantha: నువ్వు గెలవడం చూడాలనుంది.. సమంత షాకింగ్ పోస్ట్
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
మానస, నాగరాజు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. వీరిద్దరికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కాగా.. సుమారు రెండేళ్ల క్రితం ఎస్‌ఐ నాగరాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మానసను వేధిస్తున్నాడు. తన మానసను, పిల్లలను కరీంనగర్‌లో ఉంచాడు. అయితే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. అప్పుడప్పుడు కరీంనగర్ కు వచ్చిపోయేవాడు. ఏమనిపించిందో ఏమోగానీ.. చివరకు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల క్రితం కరీంనగర్ వచ్చిన ఎస్ఐ బలవంతంగా పిల్లలను తీసుకెళ్లి.. వాళ్లు ఎక్కడున్నారో మానసకు చెప్పడం లేదు. అంతేకాకుండా.. విడాకులు ఇవ్వాలని వేధించడంతో మానస ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆమె సూసైడ్ నోట్ రాసింది.
Read also: Jharkhand : పాము కాటుతో చనిపోయిన తండ్రి.. బతికేందుకు కూతురి ప్రయత్నం
దీంతో కుటుంబ సభ్యులు కలగ జేసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో ఆమె ఆత్మను విరమించుకుంది. అయితే.. ఈ విషయాన్ని సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. తనకు తమ ఇద్దరు పిల్లలకు ఎస్‌ఐ నాగరాజు, రెండో భార్యతో ప్రాణహాని ఉందని వాపోయింది. నాగరాజు.. పిల్లలు తనతో కలిసి ఉండేలా న్యాయం చేయాలని ఆమె మంగళవారం కొమురవెల్లి పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. పోలీస్టేషన్ సిబ్బంది ఎస్‌ఐ నాగరాజు సెలవులో ఉన్నారని చెప్పారు. అయితే.. మానస న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తానని పేర్కొంది. దీనిపై సీఐ శ్రీనును సంప్రదించగా.. విషయాన్ని మానస ఇటీవల తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కౌన్సెలింగ్ ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
RGV : తమిళ హీరోతో ఆర్జీవి.. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా?
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!