Site icon NTV Telugu

Komuravelli Mallikarjuna Swamy : ఘనంగా కొమురవెల్లి మల్లన్న లగ్గం..

Komuravelli Mallikarjuna Sw

Komuravelli Mallikarjuna Sw

కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆదివారం ఉద‌యం అత్యంత ఘనంగా జరిగింది. కేతమ్మ, మేడల దేవి సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అయితే స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.11 వేల కోట్లు వెచ్చించిందని, అలాగే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ.50 కోట్లు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.70 కోట్లు మంజూరు చేశారన్నారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి రూ.30 కోట్లు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.100 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను ప్రకటించారని ఆయన తెలిపారు. కొమురవెల్లిలో బిల్డింగ్ క్యూ లైన్ల కోసం రూ.11 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను ప్రకటించినట్లు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆలయంలో 50 పడకల చౌల్ట్రీ, ఇతర సౌకర్యాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read : Telangana Congress : కాసేపట్లో గాంధీభవన్‌లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం

మల్లికార్జున స్వామిపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నందున కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్)లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్‌ పేరు పెట్టారని ఆయన అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతో ప్రాజెక్టును మూడేళ్లలో రికార్డు సమయంలో పూర్తి చేయగలిగామని మంత్రి తెలిపారు.

Exit mobile version